గుంటూరు పరిధిలో తాగునీటి మీటర్లు కల్గిన కమర్షియల్ సంస్థలు, అపార్ట్మెంట్ వాసులు 3 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. లేని పక్షంలో ట్యాప్ కనెక్షన్లు తొలగిస్తామని ప్రకటించారు. సుమారు రూ. 29 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే వార్డుల వారీగా బకాయిలు చెల్లించాలని తెలియజేసినా స్పందించలేదన్నారు.