SKLM: నగరంలోని చిన్న బరాటం వీధిలో జొన్నా రవికుమార్ (44) సోమవారం రాత్రి బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి ప్రజల పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. సెకండ్ క్లాస్ సెషన్స్ జడ్జి శివరామ కృష్ణ విచారించి నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు.