అమెరికాలో ఆంక్షలున్నా.. భారతీయ విద్యార్థులు US వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గతేడాదితో పోలిస్తే 10% పెరిగారు. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గారు. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యత ఇస్తుండగా వారిలోనూ భారతీయులదే అగ్రభాగం.