ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమంటే’. నవంబర్ 21న విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్కు యువ హీరో నాగచైతన్య హాజరై మాట్లాడాడు. నటుడిగా, ప్రేక్షకుడిగా లవ్ స్టోరీస్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు. ప్రేమకథల చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపాడు.