కృష్ణా: వీ.కొతపాలెం ZPHS స్కూల్లో పోలీసులు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారుల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆన్లైన్ సేఫ్టీ వంటి అంశాలపై విద్యార్థులకు స్పష్టమైన సూచనలు అందించారు.