E.G: కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలోని భద్రకాళి విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త క్రోవిడి, సర్రాజు ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేకి ఆహ్వానం పలికారు.