KMR: కోడలిని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కీర్తన అదే గ్రామానికి చెందిన పండరిని 2021 మే 26న ప్రేమ వివాహం చేసుకుంది. కీర్తన అత్త అంబవ్వ ప్రేమ వివాహం ఇష్టం లేక నిరంతరం కీర్తనను తిడుతూ, కొడుతూ వేధిస్తూ ఉండేది.