SS: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన అండర్-17 పోటీల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను మంత్రి సవిత అభినందించారు. రొద్దం ఎంజేపీ స్కూల్ విద్యార్థులు దివాకర్ (హై జంప్), సంతోష్ కుమార్ (లాంగ్ జంప్)లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.