SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖుల రాకతో పుట్టపర్తి పట్టణమంతా స్వాగత తోరణాలతో శోభాయమానంగా ముస్తాబైంది. వీధుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రజలు తోరణాల కింద నిలబడి నాయకులు, ప్రముఖులకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.