AP: కృష్ణా, ఏలూరు, NTR, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా పేర్కొన్నారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది ఉన్నారని వెల్లడించారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.