BHPL: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామంలో ఇవాళ స్వయం సేవకులు విస్తృతంగా గృహ సంపర్క్ కార్యక్రమం చేపట్టారు. సంఘం ఆశయాలను, దేశభక్తిని ప్రజలకు వివరిస్తూ ఇంటింటా తిరుగుతూ సమాచారం అందజేస్తున్నారు.