ASF: వాంకిడి జాతీయ రహదారిపై వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద కేవలం పన్ను వసూలు చేస్తున్నారు కానీ వాహనదారులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా వద్ద వాహనాల పార్కింగ్ స్థలం, ఇంధన స్టేషన్లు, ATM సౌకర్యాలు ఉండాలి. కానీ అటువంటి ఏర్పాట్లు ఏవీ లేవని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.