VZM: గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు జాతీయ స్థాయి గౌరవం లభించింది. MAFSU ఆధ్వర్యంలో, ICMR అలాగే VCI సహకారంతో నిర్వహించిన “వన్ హెల్త్ యూత్ కాంక్లేవ్–2025” లో ఈ కళాశాల విద్యార్థుల బృందం జాతీయ స్థాయి మూడో స్థానం సాధించింది. ఈ విజయంతో కళాశాలకు ప్రతిష్ఠ లభించిందని అధికారులు బుధవారం తెలిపారు.