మహేష్ బాబు, రాజమౌళి ‘వారణాసి’పై వివాదం నెలకొంది. ఇదే టైటిల్ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించుకున్నట్లు దర్శకుడు సుబ్బారెడ్డి తెలిపాడు. ఇప్పుడు అదే టైటిల్లో రాజమౌళి ఉపయోగించడంపై TFPCలో ఫిర్యాదు చేశాడు. అయితే రాజమౌళి తెలుగు మినహా మిగతా భాషల్లో వారణాసి టైటిల్ను రిజిస్టర్ చేయించినట్లు, అందుకే టైటిల్ను తెలుగులో ఇవ్వలేదని టాక్.