ఢిల్లీలోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం ఫీజుల రూపంలో రూ.415.10 కోట్లు వసూలు చేసినట్లు ED అధికారులు గుర్తించారు. ఈ ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు తెలిపారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయ నిర్వహణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా అల్ ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని 2002 నాటి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు.