RR: గరీబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ సేవకి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలని అన్నారు.