HYD: తెలంగాణ క్రీడా, పశు సంరక్షణ శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని వినతిపత్రం అందించారు. మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి హామీల అమలు కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.