ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని అమ్మవరం కొత్తపల్లి గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనను బుధవారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉక్కు నరసింహారెడ్డి సందర్శించారు. జలపాతం వద్ద భక్తులతో మాట్లాడి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్రిముఖ దుర్గామాదేవి, కాలభైరవేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.