NLG: పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీని ప్రకారం జిల్లాలో బీసీలకు 166 స్థానాలు మాత్రమే లభించనున్నాయి. జిల్లాలోని 869 జీపీలలో 114 ఎస్సీ, ఎస్టీలకు పోగా, 755 జీపీల్లో పాత పద్ధతిలో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో 166 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కనున్నాయి.