ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న BMW కారు ఢీకొట్టడంతో 8 నెలల గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన గత వారంలో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే మృతురాలు భారత్కు చెందిన సమన్విత ధారేశ్వర్(33)గా అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.