HYD: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. స్పీకర్ చర్య తీసుకుంటే, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల వంటి 3 స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.