రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. చివరి 4-5 నెలల్లో ఆహార చట్టం కింద అనర్హులైన 2.25 కోట్ల మందిని రేషన్ పథకం నుంచి తొలగించింది. ఫలితంగా అర్హులైన వారికే ప్రయోజనాలు అందుతాయని, ఆహార భద్రత పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అనర్హుల తొలగింపును DFPD సెక్రటరీ సంజీవ్ చోప్రా ధ్రువీకరించారు.