AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఘనస్వాగతం పలికారు. అయితే హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో ప్రశాంత నిలయానికి మోదీ చేరుకోనున్నారు.