GNTR: తెనాలి 37వ వార్డు పరిధిలోని గంగానమ్మపేటలో రోడ్లపై ఎక్కడ చూసినా వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. తొలగించిన చెట్ల కొమ్మలతో పాటు ఇళ్లలోని వ్యర్థాలు వీధుల్లోని గోడల వెంబడి గుట్టలుగా పోస్తున్నారు. రజక చెరువు పార్క్ సమీప ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు.అధికారులు సమస్యపై స్పందించి పరిష్కరించాలని బుధవారం స్థానిక ప్రజలు కోరారు.