NZB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు టిప్పర్ల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినట్లు సాలూర తహసీల్దార్ శశి భూషణ్ తెలిపారు. బుధవారం నుంచి మంజీరా పరీవాహక ప్రాంతమైన తగ్గేల్లి నుంచి ఇసుక రవాణాకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. టిప్పర్ల ద్వారా నిజామాబాద్ రూరల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.