GNTR: తెనాలిలోని చినరావూరు పార్కును మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం ఉదయం సందర్శించారు. పార్కులో ఆట పరికరాలను చూసి, వాటి పనితీరును పరిశీలించారు. క్రమం తప్పకుండా వీటిని గమనిస్తూ ఉండాలని, మరమ్మతులకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్కుకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కమిషనర్ సూచించారు.