ATP: గుత్తిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు గుంతలు పడ్డాయి. కెప్టెన్ స్కూల్ సమీపంలో గుంతలు పడ్డ రోడ్డుకు బుధవారం ఆటో డ్రైవర్ జాఫర్ కంకర వేసి పూడ్చి వేశాడు. జాఫర్ మాట్లాడుతూ.. రాత్రి సమయాలలో రోడ్డుపై ఉన్న గుంతలు కనపడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నాడు. ఆటో డ్రైవర్ను పట్టణ ప్రజలు అభినందించారు.