ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) భారీ జరిమానా విధించింది. ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్రొసీజర్‌కు సంబంధించి నిబంధనలను బ్రేక్ చేసినందుకుగానూ ఇండిగోపై రూ.20 లక్షల ఫైన్ విధించింది. దీనివల్ల తమ సంస్థ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని ఇండిగో తెలిపింది.