GDWL: అయిజ మండలం వెంకటాపురంలోని శివాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున పంచాక్షరి నామ మంత్ర పారాయణం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. శివ భక్తులు దాదాపు 21,500 సార్లు ఈ నామాన్ని చదవనున్నారని, గురువారం తెల్లవారుజామున 6 గంటలకు మహా మంగళహారతితో ఈ పారాయణాన్ని ముగిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.