NLG: పేద ప్రజల సంక్షేమం కోసం స్వర్గీయ ఇందిరాగాంధీ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ నకిరేకల్‌లోని కూడలిలో గల ఆమె విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమె ప్రాణత్యాగం దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.