AP: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం హిడ్మా దంపతుల మృతదేహాలతోపాటు మరో నలుగురు మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్నారు. కాకినాడ, విశాఖ నుంచి ఫోరెన్సిక్ బృందం రానుంది. ఆస్పత్రి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.