KMM: చైతన్యంతోనే సమాజ మార్పు సాధ్యమని TPTF జిల్లా ఉపాధ్యక్షుడు గంధసిరి మల్లయ్య అన్నారు. కూసుమంచిలో జరిగిన PDSU పాలేరు డివిజన్ మహాసభలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయ విద్యా సాధనకు, అందరికీ సమానమైన విద్య అందించటం కోసం విద్యార్థి సంఘాలు పాలకవర్గాలపై పోరాడాలన్నారు. ఈ సభలో డివిజన్ నూతన కమిటీ అద్యక్షుడిగా శ్రీను, ప్రధాన కార్యదర్శిగా రఘు ఎన్నికయ్యారు.