AP: కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్లో హిడ్మా మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు మాధవిహండా సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. సరోజ్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి. రావులపాలెం ఎందుకు వచ్చారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.