దర్శకుడు రాధాకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి రమణి(60) కన్నుమూశారు. ఈనెల 15వ తేదీనే ఆమె చనిపోయారు. కానీ రాధాకృష్ణ ఇవాళ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రపంచంలో నాకంటూ ఓ స్థానం ఇచ్చావ్. నా మనసులో శూన్యత మిగిల్చి వెళ్లిపోయావ్ అమ్మ’ అంటూ పోస్టు పెట్టాడు. కాగా రాధాకృష్ణ.. గోపీచంద్‌తో జిల్, ప్రభాస్‌తో రాధేశ్యామ్ మూవీలు తెరకెక్కించారు.