MDK: నిజాంపేట మండలం కల్వకుంట, నార్లపూర్, తిప్పనగుల్ల, బచ్చురాజుపల్లి, నస్కల్, నందగోకుల్, చల్మెడ, రాంపూర్ గ్రామాలకు నేటికీ బస్సులు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే 7 కిలోమీటర్లు బైకుపై నిజాంపేటకు వెళ్లి అక్కడినుంచి బస్సు ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి బస్సులు నడపాలని కోరుతున్నారు.