SKLM: అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మృతుల్లో శ్రీకాకుళానికి చెందిన మావోయిస్టు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.