HYD: PVNR ఎక్స్ప్రెస్హైవే పై ఓ వాహనం బ్రేక్ డౌన్ అయ్యింది. ఆరాంఘర్ వైపు వెళ్లే మార్గంలో, పిల్లర్ నం. 118 వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ వాహనాలు నెమ్మదించాయి. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, బ్రేక్ డౌన్ అయిన వాహనాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే ట్రాఫిక్ పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు తెలిపారు.