ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని, సమర్థించకూడదని భారత్ సూచించింది. SCO సమావేశంలో MEA జైశంకర్..‘ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉంది. తదనుగుణంగా చర్యలు తీసుకుంది, తీసుకుంటుంది. గడిచిన ఏళ్లలో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ముప్పు ఎక్కువైంది. వీటిపై పోరాటానికే SCO ఏర్పడిందన్న విషయం మర్చిపోకూడద’న్నారు.