VZM: బొబ్బిలి మండలంలోని శివడవలస, కమ్మవలస సచివాలయాలను ఎంపీడీవో పి.రవికుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు హాజరు రికార్డులను, మూవ్మెంట్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలని తెలిపారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.