GNTR: జిల్లాలోని బ్యాంక్ కాలనీ రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన దేవి ప్రత్యూష అనే యువతి వాటర్ హీటర్ కారణంగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బకెట్లో హీటర్ పెట్టి భర్త కోసం వేడి నీళ్లు పెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.