కోనసీమ: వాడపల్లి పర్యటనకు విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ కు బుధవారం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు. ఎంపీ భరత్ కు దుస్సాలువా కప్పి పుష్ప గుచ్చంతో సత్కరించారు. అనంతరం పార్టీ కార్యక్రమంలో పలు విషయాలు పై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు