NZB: డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ. 2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.