NLG: మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్వో 9001: 2015 నాణ్యత నిర్వహణ సర్టిఫికేషన్‌ను సాధించింది. జిల్లాలో ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి పీఏసీఎస్ మునుగోడే కావడం విశేషం. ఈ సర్టిఫికెట్‌ను నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి అందజేశారు.