పూణే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన పెళ్లి విషయంపై ఓపెన్ అయిపోయింది. ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడని భాగ్యశ్రీ, ఈసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎప్పటికైనా నాకు నచ్చే, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఇది ఫిక్స్’ అని చెప్పింది.