ప్రకాశం: వెలిగండ్లలో ఇవాళ ఎమ్మెల్యే ఉగ్ర పర్యటించనున్నారని మండల టీడీపీ అధ్యక్షులు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొదట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్పీ పాఠశాల మైదానంలో అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమంలో రైతులతో ముఖాముఖిగా పాల్గొంటారని అన్నారు.