ADB: గుడిహత్నూర్ మండలంలోని తోషంగూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రతినిధి అక్షయ్ తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.