E.G: కడియం మండలంలోని కడియపులంకలో ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జెటి రామారావు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఇందిరాగాంధీని నేడు అవమానించే వారు దేశభక్తులు కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.