కరీంనగర్ మండలంలోని అంబేడ్కర్ బస్ స్టేషన్ ఆవరణలోని రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఆర్ఎం బీ. రాజు మంగళవారం రీజియన్ అధికారులు, సిబ్బందిచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని పాటిస్తూ, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.