మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా 10 రోజుల క్రితమే ఓ జర్నలిస్టుకు తన చివరి లేఖ రాసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీలో తనను కలవాలని, ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని, భద్రత హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. త్వరలో హిందీతోపాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతామన్నా హిడ్మా.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాలని లేఖలో ఉన్నట్లు సమాచారం.