NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల దొంగతనం జరిగింది. దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు వెంటనే పట్టుకుని కేసును ఛేదించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం రాచకొండ సీపీ సుధీర్ బాబును ఆయన ఛాంబర్లో కలిసి అభినందించారు. అనంతరం వారు వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించారు.